మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట! | BioQuark’s Ira Pastor: Meet the Man Whose Biotech Company Is Trying to Bring People Back From the Dead | Sakshi
Sakshi News home page

మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!

Published Wed, Jun 7 2017 4:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!

మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!

‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః..
ధ్రువం జన్మ మృతస్య చ..’’    – భగవద్గీత


పుట్టినవాడు మరణించక తప్పదు.. మరణించిన వారు మళ్లీ ఇంకో రూపంలో ఎక్క డో ఒకచోట పుట్టక తప్పదు అంటుంది భగవ ద్గీత. అయితే ఇది 21వ శతాబ్దం. గతకాలపు నమ్మకాలను, ప్రకృతి సహజమని భావించే అంశాలనూ టెక్నాలజీతో సవాల్‌ చేస్తున్న కాలమిది. దీనికి చావు ఎందుకు అతీతంగా ఉండాలని అనుకుందో ఏమో.. ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తున్న బయోక్వార్క్‌ సంస్థ. చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తామని ప్రక టించింది. ఇది కూడా ఎప్పుడో భవిష్యత్తులో కాదు. ఏడాది తిరక్కముందే ఈ ప్రయోగం పూర్తవుతుందని అంటోంది.

 చనిపోయిన వాళ్లు మళ్లీ లేచి వచ్చేస్తే.. ఇది కలికాలం కాక మరేమవుతుంది?
బయోక్వార్క్‌ ఏం చేస్తుందో..? దాని ఫలి తాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు అసలు చావు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. వైద్య శాస్త్ర నిఘంటువు ప్రకారం.. గుండె కొట్టుకోవడం మొద లుకుని మెదడు పనిచేయడం వరకూ అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవ డాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మిగిలిన అవయవాల మాట ఎలా ఉన్నప్పటికీ మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవ డాన్నే చావు అని నిర్ణయిస్తారు.

 ఇలా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేంచేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించామని అంటోంది బయోక్వార్క్‌. దక్షిణ అమెరికా దేశాల్లో ఒకదానికి చెందిన వ్యక్తిపై 6 నెలల్లో ఈ ప్రయో గం జరుగుతుందని బయోక్వార్క్‌ సీఈవో ఇరా పాస్టర్‌ అంటున్నారు. సాధారణ ప్రయోగాల మాదిరిగా జంతువులపై ప్రయోగాలేవీ జరపకుండా నేరుగా మానవులపైనే ఈ ప్రయోగం జరగనుండటం విశేషం.

మూలకణాల చికిత్స..
బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేలా చేసేందుకు బయోక్వార్క్‌ చేస్తున్న ప్రయోగంలో మూలకణాలదే కీలకపాత్ర. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పించడంతో బయోక్వార్క్‌ పద్ధతి ప్రారంభమవుతుంది. రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్‌టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్‌ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్‌ నాడిని లేజర్‌ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజులపాటు చేస్తే అతడి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుం దని బయోక్వార్క్‌ అంచనా.

భారతీయ వైద్యుడి సహకారం..
బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తులను మళ్లీ బతికిస్తామన్న బయోక్వార్క్‌ ప్రయత్నానికి హిమాన్షు బన్సల్‌ అనే భారతీయ వైద్యుడు సహకారమందిస్తున్నాడు. గత ఏడాది మేలో హిమాన్షు భారత్‌లోని ఉత్తరాఖండ్‌లోనే ఈ ప్రయోగాలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తామని, అనుమతివ్వమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు దరఖాస్తు చేశారు కూడా. అయితే ఈ విజ్ఞప్తిని ఐసీఎంఆర్‌ నవంబర్‌లో తోసిపుచ్చింది. హిమాన్షు ప్రయోగాలకు అవసరమైన పెప్‌టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లో బయోక్వార్క్‌ ముందుకు రావడం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడు. కాకపోతే కళ్లు కదపడం.. లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు. కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందన్నది మాత్రం చెప్పలేం!    
    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement