గణాంకాల ప్రభావం
• జీడీపీ, ఐఐపీ గణాంకాలతో మార్కెట్ గమనం
• వాహన కంపెనీల షేర్లు వెలుగులో
• ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే జీడీపీ, ఇతర ఆర్థిక గణాంకాలు, టాటా పవర్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపారుు మారకం ప్రభావం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కె ట్ పోకడలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
30న జీడీపీ గణాంకాలు
సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు ఈ నెల 30(బుధవారం) వెలువడుతారుు. అదే రోజూ అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతారుు. ఇక డిసెంబర్ 1 గురువారం రోజు తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాం కాలు వస్తారుు. అదే రోజు నవంబర్ నెల వాహన విక్రయ వివరాలను వాహన కంపెనీలు వెల్లడిస్తారుు. ఈ కారణంగా వాహన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఇక కంపెనీల ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, ఈ నెల 28 సోమవారం రోజు ఆరుుల్ ఇండియా, అబాట్ ఇండియా కంపెనీలు, 29 మంగళవారం రోజు టాటా పవర్ కంపెనీలు తమ తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తారుు.
ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, సోమవారం (ఈ నెల 28న) నవంబర్ నెల యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్ గణాం కాలు, గురువారం(డిసెంబర్ 1) చైనా తయారీ యేత ర రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, శుక్రవారం (డిసెంబర్ 2)అమెరికా వ్యవసాయేతర రంగ ఉద్యోగ గణాంకాలు (నవంబర్ నెల) వస్తారుు. గత వారం లో సెన్సెక్స్166 పారుుంట్లు, నిఫ్టీ 40 పారుుంట్ల చొప్పున పెరిగారుు.
తరలిపోతున్న విదేశీ నిధులు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి 470 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందన్న భయాలే దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఈ నెల1-25 మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.15,763 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.16,154 కోట్లు, మొత్తం మన క్యాపిటల్ మార్కెట్‌నుంచి రూ.31,917 కోట్లు(470 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల నిధులు వెనక్కి తీసుకోగా, సెప్టెంబర్‌లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.37,146 కోట్లు నికర పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.23,868 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి కారణంగా అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఫండ్‌సఇండియాడాట్‌కామ్ సీఓఓ విద్యా బాల చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా ట్రంప్ గెలవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వృద్ధి తగ్గొచ్చన్న ఆందోళనలు వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది 11 నెలల్లో ఏడు నెలల పాటు విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో నికర అమ్మకాలు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు.
‘పార్లమెంట్ సమావేశాల’ ప్రభావం
ఈ వారంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలకమైన ఆర్థిక గణాంకాలు వెలువడుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వివరించారు. పెద్ద కరెన్నీ నోట్ల రద్దుకు సంబంధించి తదుపరి వార్తలు ఏమీ రాకుంటే, మార్కెట్ సానుకూలంగా చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డెరైక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు.