
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 146 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడ్డాయి.
సెన్సెక్స్ 26,575 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,927 పాయింట్ల వద్ద ముగిశాయి.
మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ భారీ విజయాలు సాధించడం భారత స్టాక్ మార్కెట్లకు మంచి సెంటిమెంటుగా మారింది. డీజిల్ ధరల మీద నియంత్రణను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా సానుకూలంగా మారింది.