సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డుల జోరుకొనసాగుతోంది. బుధవారం 35వేలకు ఎగువన స్థిరంగా ముగిసిన సెన్సెక్స్ నేడు భారీలాభాలతో షురూ అయింది. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను సాధించింది. అటు నిఫ్టీ 10,850 వద్ద మరో గరిష్టాన్ని అధిగమించింది. అంతేకాదు 11వేల వైపు శరవేగంగా పయనిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్ మరోసారి పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డ్ స్తాయిని దాటి ట్రేడ్ అవుతోంది. భారీ లాభాలతో మార్కెట్లకు జోష్ నిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎస్‌బ్యాంక్, ఐసీఐసీఐ లాభపడుతుండగా ఇన్‌ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐడీసీ, హిందాల్కో, అంబుజా, విప్రో, అల్ట్రాటెక్, హెచ్‌పీసీఎల్, వేదాంతా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment