
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలనుంచి కాస్త విరామనం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆరంభంనుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే కదులుతున్నాయి. గత రెండురోజులుగా హెవీ వెయిట్ షేర్లన్ని ఆల్ టైం గరిష్టాలను నమోదు చేయడంతో, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 37,785వద్ద. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్రపు లాభాలతో 11,342 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించింది.
ఫార్మా 0.8 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎయిర్‌టెల్, ఐబీ హౌసింగ్, ఎన్‌టీపీసీ, వేదాంతా, ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ 2.4-0.7 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు అల్ట్రాటెక్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటన్, హిందాల్కో, హీరో మోటో, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోతున్నాయి.