
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు పటిష్టంగా మొదలైనాయి. సెన్సెక్స్ 36పాయింట్లకు పైగా పుంజుకొని 34,431వద్ద నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10560 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. వాతావరణ అంచనాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం సానుకూ లంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కీలక సూచీలు నష్టాల్లోకి మళ్ళాయి.
ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగాలు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, విప్రో, గెయిల్, జీ, ఐటీసీ, అల్ట్రాటెక్, వేదాంతా, యస్‌బ్యాంక్, సన్ ఫార్మా, ఐషర్ లాభాల్లోనూ బీపీసీఎల్, హిందాల్కో, ఐవోసీ, ఎంఅండ్‌ఎం, కొటక్ బ్యాంక్, టైటన్; ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు రుపీ మరింత డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ మరింత బలహీన పడింది.0.24 పైసలు నష‍్టంతో 65.73 వద్ద కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో 93 రూపాయలు లాభపడిన 10 గ్రా.పసిడి 31,391 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment