
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడి నుంచి కీలక సూచీలకు ఉపశమనం లభించింది. సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో వద్ద 34, 442, నిఫ్టీ 27 పాయింట్లు ఎగిసి 10327వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్‌తో పాటు దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ లైఫ్‌లైన్ మార్కెట్లకు ఊతమిచ్చింది. ఎస్‌బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, వేదాంతా, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఐటీ ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, మారికో, బ్రిటానియాతోపాటు ఆర్‌ఐఎల్ నష్టపోతోంది.
దేశీయ కరెన్సీ డాలరు బుధవారం కొంత సానుకూలంగా మొదలైంది. డాలరుమారకంలో రూపాయి 74.38 వద్ద నిన్నటి ముగింపుతో పోలిస్తే ఈ రోజు కొద్దిగా కోలుకుంది. అయితే 74 స్థాయి వద్దే కొనసాగుతోంది. 24 పైసలు పుంజుకుని 74.15 వద్ద మొదలైన రూపాయి 74.22వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment