సాక్షి, ముంబై : దేశీయస్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి ఇన్వెస్లర్ల కొనుగోళ‍్లతో 250 పాయింట్లకుపైగా ఎగిసిన కీలక సూచీలు అదే స్థాయిలో పతనాన్ని నమోదు చేసింది. మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ ఏకంగా 150 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 10600 స్థాయి కిందికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, కోల్ ఇండియా, టీసీఎస్ భారీగా నష్టపోయాయి. ఇంకా ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐబీ హౌసింగ్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, యూపీఎల్ కూడా నష్టపోతున్నాయి. దీంతోపాటు ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు కూడా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదిదో రోజూ కుడా నష్టాల్లో ముగిసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment