సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉన్నట్టుండీ ఫ్లాట్‌గా మారాయి. ఒకదశలో 400పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్ ఇన్వెస్టర్ల లాభాలతో స్వీకరణతో నెగిటివ్‌గా మారిపోయింది. తద్వారా సెన్సెక్స్ 38వేల దిగువకు, నిఫ్టీ 11250 దిగువకు చేరాయి. స్వల్పంగా పుంజుకున్నప్పటికీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 93 పాయింట్ల లాభంతో 37963 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభంతో 11252 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా డూ హై నుంచి 850 పాయింట్లు పతనమైంది. మెటల్, బ్యాంకింగ్ లాభపడుతుండగా, ఐటీ, ఫార్మా నష్టపోతోంది.
ఇన్ఫోసిస్ , ఓఎన్‌జీసీ , హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా, కోటక్‌మహీంద్ర, వేదాంతా , ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఫలితాల ప్రభావంతోటీసీఎస్ నష్టపోతోంది. యస్‌బ్యాంకు, ఇందస్‌ఇండ్, ఐవోసీ, గెయిల్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రుపీ బలపడింది. నిన్నటి ముగింపు 71.06తో పోలిస్తే 26 పైసలు ఎగిసి 70.80 స్థాయిని టచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment