
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి. రికార్డు లాభాలతో వరుసగా మూడో రోజూ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించినా, మిడ్ సెషన్‌నుంచి ఫ్లాట్‌గా మారాయి. బుధవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ తొలుత 39,270 వద్ద సరికొత్త గరిష్టాన్ని(ఇంట్రాడే) తాకింది. అలాగే నిఫ్టీ 11,761 వద్ద రికార్డ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 35 లాభాలకు పరిమితమై 39,092 వద్దకు నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 11,709 కి చేరింది.
రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా నష్టపోతున్నాయి. ఐబీ హౌసింగ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఇండస్‌ఇండ్, బజాజ్ ఫిన్, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతుండగా, పీసీఎల్, ఐవోసీ, గెయిల్, ఎల్‌అండ్‌టీ, ఐషర్, జీ, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment