నిర్మాణాత్మక సంస్కరణలతో భారత్కు తిరుగులేదు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంటే భారత మార్కెట్లు దాని ప్రభావానికి లోనుకాకుండా స్థిరంగా ఉన్నాయని డ్యుయిష్ బ్యాంక్ సీఈవో గునిత్ చద్దా వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక సంస్కరణల సహాయంతో ఇతర ఆర్థిక వ్యవస్థలను తలదన్నే రీతిలో ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక క్రమశిక్షణతో, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే భారత్ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం కష్టం కాదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థికరంగ అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. అటు పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ఇటు టీ. 20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడానికి సరిపడా ధీటైన టీం ఇండియాకు ఉందని చద్దా వ్యాఖ్యానించారు.
ఇక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ కేంద్ర బ్యాంకులు , G- 20 అంశాల్లో డాక్టర్ రఘురామ్ రాజన్ అభిప్రాయాలతో అంగీకరిస్తున్నానన్నారు. కేంద్ర బ్యాంకుల మధ్య సమన్వయం, సహకారం అవసరం అన్నారు. ఫలితంగా కొన్ని పెద్ద మార్కెట్లలో సుదీర్గ సంక్షోభ ప్రమాదం ఉండబోదన్నారు.