Structural reforms
-
2027 నాటికి భారత్... టాప్3
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. బహుళజాతి కంపెనీల లిస్టింగ్ బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. బలమైన భవిష్యత్తుకు పునాది అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది. -
సంస్కరణల అమలు సులువేం కాదు..
* రాజకీయంగా అనేక అడ్డంకులున్నాయి... * ఆర్బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు భువనేశ్వర్: భారత్‌లో నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం రాజకీయంగా కష్టతరమైన అంశమేనని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల మొండిబకాయిల సమస్యను పరిష్కరించడం, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా వృద్ధిని పరుగులు పెట్టించవచ్చని చెప్పారు. అదేవిధంగా కార్మిక సంస్కరణలు కూడా వృద్ధి జోరుకు దోహదం చేస్తాయని, అయితే దీనికి రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఉండొచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ-భారత్’ అనే అంశంపై ఆయన చేసిన ఒక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్ వంటి వర్ధమాన దేశాలు తమ గొంతును మరింత బలంగా వినిపించాల్సిందేనని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి ప్రభావం నుంచి భారత్ సురక్షితంగానే ఉందని చెప్పారు. ‘వరుసగా రెండేళ్లు కరువు, ప్రపంచ మార్కెట్లో డిమాండ్ బలహీనతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ... మనం 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నాం. దీనికి స్థూల ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వమే కారణం. అయితే, దీన్ని ఇదేవిధంగా కొనసాగించాలంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, బ్యాంకుల మొండిబకాయిల సమస్యకు తగిన పరిష్కారం చూపడం వంటివి కీలకం. అదేవిధంగా సంస్కరణల కొనసాగింపు ద్వారా దేశీ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలవుతుంది. ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునేలా చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యం. అయితే, రాజకీయంగా ఇది కష్టసాధ్యమైన విషయమే’ అని రాజన్ వివరించారు. రాజన్‌కు మరో అవకాశం ఇవ్వాలి: ఆది గోద్రెజ్ మరికొద్ది నెలల్లో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల గడువు ముగియనున్న నేపథ్యంలో రఘురామ్ రాజన్‌కు పారిశ్రామిక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రాజన్‌ను స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అభివర్ణించిన దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్.. ఆయన్ను గవర్నర్‌గా మరోవిడత కొనసాగిస్తే భారత్‌కు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2013 సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన రాజన్ మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థను రాజన్ ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీశారని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వామి ప్రధానికి లేఖ కూడా రాశారు. అయితే, ఈ వివాదంపై స్పందించేందుకు గోద్రెజ్ నిరాకరించారు. ‘ఇతర వ్యక్తులు ఏమన్నారన్నదానిపై నేను వ్యాఖ్యానించను. ప్రపంచవ్యాప్తంగా రాజన్‌కు అత్యంత గౌరవమర్యాదలు ఉన్నాయి. అనేక బిజినెస్ మ్యాగజీన్స్ ఆయనను అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎంపికచేశాయి. ఆయన గవర్నర్ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. మరోసారి అవకాశం ఇవ్వడం దేశానికే మంచిది. అందుకే నేను ఆయన బాధ్యతల పొడిగింపునకు మద్దతిస్తున్నా’ అని గోద్రెజ్ వ్యాఖ్యానించారు. -
వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం
భారత్‌పై ఎస్అండ్పీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ 8 శాతం వృద్ధి సాధనకు వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని గ్లోబల్ రేటింగ్స్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తన తాజా నివేదికలో తెలిపింది. దివాలా బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని ఈ సందర్భంగా ప్రశంసించిన ఎస్అండ్పీ.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తదుపరి లక్ష్యంగా ఉండాలని సూచించింది. చైనా, తదితర ఆర్థిక వ్యవస్థల ఒడిదుడుకుల నుంచి భారత్ తట్టుకుని నిలబడగలుగుతున్నట్లు వివరించింది. గడచిన ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.6 శాతం కాగా, అది 2016-17లో 7.9 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 8 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. తగిన వర్షపాతం అంచనాలు నిజంకావడంసహా... ఫైనాన్షియల్ మార్కెట్ స్థిరపడ్డం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే బడ్జెట్, సంస్కరణల పథంలో దేశం ముందుకు సాగుతుండటం వంటి అంశాలు... ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఇబ్బందులను తగ్గిస్తున్నట్లు ఎస్అండ్పీ అభిప్రాయపడింది. గ్రామీణ వినియోగం పెరుగుతుందని, వృద్ధికి పెట్టుబడుల మద్దతు ఉంటుందని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నట్లు తన ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్షార్ట్స్లో రేటింగ్ సంస్థ పేర్కొంది. -
నిర్మాణాత్మక సంస్కరణలతో భారత్‌కు తిరుగులేదు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంటే భారత మార్కెట్లు దాని ప్రభావానికి లోనుకాకుండా స్థిరంగా ఉన్నాయని డ్యుయిష్ బ్యాంక్ సీఈవో గునిత్ చద్దా వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక సంస్కరణల సహాయంతో ఇతర ఆర్థిక వ్యవస్థలను తలదన్నే రీతిలో ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే భారత్ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం కష్టం కాదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థికరంగ అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. అటు పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ఇటు టీ. 20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడానికి సరిపడా ధీటైన టీం ఇండియాకు ఉందని చద్దా వ్యాఖ్యానించారు. ఇక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ కేంద్ర బ్యాంకులు , G- 20 అంశాల్లో డాక్టర్ రఘురామ్ రాజన్ అభిప్రాయాలతో అంగీకరిస్తున్నానన్నారు. కేంద్ర బ్యాంకుల మధ్య సమన్వయం, సహకారం అవసరం అన్నారు. ఫలితంగా కొన్ని పెద్ద మార్కెట్లలో సుదీర్గ సంక్షోభ ప్రమాదం ఉండబోదన్నారు.