keep
-
నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి..
నూతన సంవత్సరం వచ్చింది.. ‘ఇకపై రోజూ వ్యాయామం చేస్తా.. పొద్దున్నే లేచి బుక్స్ పట్టుకుంటా.. సిగరెట్ మానేస్తా.. మందు ముట్టుకోను..’ ఎవరికి వారు పెట్టుకునే ఇలాంటి టార్గెట్లెన్నో.. వీటిని కొద్దిరోజులు గట్టిగానే పాటించి.. ఆ తర్వాత వట్టిగానే వదిలేస్తుండటమూ కామనే. మరి ఇలా కొత్త సంవత్సరం కోసం కొత్త కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ ప్రోగ్రామ్‌లను అడిగితే ఏమేం సూచించాయో తెలుసా..? – సాక్షి సెంట్రల్ డెస్క్ కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని? ఇటీవల ఏఐ ప్రోగ్రామ్‌ల వినియోగం పెరిగిపోయింది. ఫొటోలను, వీడియోలను సృష్టించడం నుంచి కంప్యూటర్ కోడ్లను రాసిపెట్టడం, కెరీర్ సలహాల దాకా ఎన్నో పనులకు ఏఐని వాడేస్తున్నారు. ఈ క్రమంలో డెయిలీమెయిల్ వెబ్సైట్.. గూగుల్‌కు చెందిన ‘బార్డ్’, మైక్రోసాఫ్ట్ బింగ్‌కు అనుసంధానం చేసిన ‘చాట్‌జీపీటీ’, అమెజాన్ సహకారంతో అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ఏఐ ప్రోగ్రామ్‌లను విభిన్నమైన ప్రశ్న అడిగింది. ఈ 2024 సంవత్సరంలో.. విభిన్నమైన లక్ష్యాలను సూచించాలని, అయితే అవి సులువుగా సాధించగలిగేలా ఉండాలని కోరింది. దీనికి ఏఐ ప్రోగ్రామ్‌లు నిజంగానే వినూత్న ఐడియాలు ఇచ్చాయి. కృత్రిమ మేధ అంటేనే డిజిటల్ ప్రోగ్రామ్‌లు. అయినా సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలంటూ సూచనలు చేయడం గమనార్హం. నెలకో డిన్నర్ థీమ్ పార్టీ ప్రతినెలా ఓ రోజు విభిన్నమైన థీమ్‌తో డిన్నర్ పార్టీ చేసుకోవాలని గూగుల్ బార్డ్ సూచించింది. ‘‘పురాతన విందుల నుంచి స్పేస్‌లో ప్రయాణం దాకా భిన్నమైన థీమ్‌లు పెట్టుకుని డిన్నర్ పార్టీ చేసుకోండి. ప్రతిసారి సరికొత్త వంటకాలను ప్రయత్నించండి. ఇలాంటి పారీ్టల వల్ల స్నేహం, బంధాలు బలపడతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి..’’అని పేర్కొంది. మీ కుటుంబ మూలాల్లోకి వెళ్లండి ‘‘మీ కుటుంబం మూలాల్లోకి వెళ్లండి. దూరపు బంధువులు, పెద్దలను కలసి కుటుంబ చరిత్రను, పూరీ్వకుల ఘనతను తెలుసుకోండి. ఫ్యామిలీ ట్రీని రూపొందించుకోండి. మీకు ఎన్నో ఉత్కంఠ భరిత అంశాలు తెలియవచ్చు. అంతా సరికొత్తగా ఉంటుంది..’’అని గూగుల్ బార్డ్ సూచించింది. వారానికోసారి చేతి రాతతో లెటర్ రాయండి ప్రతి వారం చేతిరాతతో కూడిన లేఖలు రాసే అలవాటు చేసుకోవాలని క్లాడ్ ఏఐ సూచించింది. ‘‘దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఒకప్పటి తరహాలో చేతి రాతతో లెటర్లు రాయండి. మీ అనుభూతులను, ఆలోచనలను అందులో పంచుకోండి. ఈ అనుభవం ఎంతో బాగుంటుంది’’అని క్లాడ్ పేర్కొంది. ‘డిజిటల్ డిటాక్స్’ మొదలుపెట్టండి కొత్త సంవత్సరం సందర్భంగా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండే (డిజిటల్ డిటాక్స్) తీర్మానం చేసుకోవాలని చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలాంటి డిజిటల్ పరికరాలు వాడొద్దన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటివి చేయండి..’’అని సూచించింది. వారానికో రోజు పూర్తి వెజ్.. మీ ఆహార అలవాట్లను నియంత్రించుకుని, వారానికి ఓ రోజు పూర్తిగా శాఖాహారమే తీసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ‘చాట్‌జీపీటీ’సూచించింది. ‘‘వారానికి ఒక రోజు పూర్తిగా వెజ్. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, రుచులను ఆస్వాదించండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుతుంది. పర్యావరణానికీ ఎంతో మంచిది..’’అని పేర్కొంది. కొత్త ఏడాది కోసం ‘ఏఐ’ చెప్పిన సరికొత్త లక్ష్యాలు మీకు నచ్చిన అంశంపై రోజుకో వాక్యం ‘‘మీకు నచ్చిన, బాగా ఆసక్తి ఉన్న అంశంపై డైరీ లాంటి ఓ జర్నల్ను మొదలుపెట్టండి. అందులో రోజుకు కనీసం ఒక్క వాక్యాన్ని తప్పనిసరిగా రాస్తూ వెళ్లండి. కొంతకాలానికి ఈ జర్నల్ ఎంతో ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకుంటుంది..’’అని చాట్‌జీపీటీ సూచించింది. చిన్ననాటి భయాన్ని దూరం చేసుకోండి ప్రతి ఒక్కరికీ చిన్ననాటి భయాలు కొన్ని ఉంటాయి. నదులు, సముద్రాల్లోకి దిగడానికి.. రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివి ఎక్కడానికి భయపడుతుంటారు. పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడటానికి మొహమాటపడతారు.. సాలె పురుగులు, బల్లులను చూస్తే దూరంగా పరుగెడతారు. ఇలాంటి వాటిని వదిలించుకునేలా కొత్త సంవత్సరం ప్రయత్నించాలని క్లాడ్ ఏఐ సూచించింది. ఖర్చులకు బడ్జెట్.. పొదుపుపై ఫోకస్ ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బింగ్–చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘ప్రతి ఖర్చును నమోదు చేస్తూ బడ్జెట్ రూపొందించుకోండి, కచ్చితంగా డబ్బును పొదుపు చేయండి, జాగ్రత్తపడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి’’అని సూచించింది. మెదడును సానబెట్టండి కొత్త సంవత్సరంలో మీ మెదడుకు పనిచెప్పి, చురుగ్గా ఉండేలా ప్రయత్నించాలని గూగుల్ బార్డ్ సూచించింది. ఏదైనా ఒక తేదీ చెప్తే.. అది ఏ వారమో చెప్పగలిగేలా ప్రయత్నం చేయాలని.. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. -
Covid-19: 'మహమ్మారి ఇంకా ముగియలేదు' అంటూ కేంద్రం లేఖ
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసుల తోపాటు మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్ సంక్రమణని సూచిస్తోందన్నారు. అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యాన, ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ లేఖలను అందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది. ఆయ జిల్లాలోని కోవిడ్ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో తాజగా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..దేశ రాజధానిలో కోవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయన్నారు. ఐతే ఇటీవల కొద్దిరోజులుగా మాత్రం కేసులు పెరుగుతున్నాయని, కాని రాబేయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారే కావడం యాదృచ్చికం అన్నారు. ఏదైనా మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరమని, ఇలా జరగకూడదన్నారు ఆరోగ్య మంత్రి భరద్వాజ్. (చదవండి: సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!) -
ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?
దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! నిబంధనలు ఏం చెబుతున్నాయి? అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్లు, ఆధార్, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది. -
తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని తుఫాను, భారీ వర్షాలు మరోసారి వణికిస్తున్నాయి. వార్దా తుఫాను విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ముఖ్యంగా వార్దా తుఫాను, ఈదురుగాలులకు భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రధాన జలాశయాల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా పూండి, చంబరం పక్కం ఇతర జలాశయాల ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరింది. తమిళనాడు లోని చెన్నె తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో వర్షపాతం తీవ్రత భారీగా ఉంది. కొన్ని ప్రదేశాలలో 7-19 సెం.మీ వర్షం నమోదైంది. ఇదిక్ర మంగా పెరుగుతూ 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీంతో చెన్నై నగరం చుట్టు పక్కల ఉన్న పూండి, చంబరం పక్కం రిజర్వాయర్లు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్లు పూర్తిగా నిండనప్పటికీ, ఊహించని వర్షాలతో ప్రమాదకరంగా మారేఅవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించినట్టు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వర్షధాటికి భారీగా చెట్లు కూలిపోతున్నాయి. దీంతో నావీ రంగంలోకి దిగింది. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే రెండు నౌకలు అందుబాటులో ఉంచామని, తక్షణం సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ ఛీప్ కెప్టెన్ డీకే శర్మ ప్రకటించారు. -
తాజాదనానికి 'సిల్క్' కోటింగ్!
వాషింగ్టన్ః పక్వానికి వచ్చిన కాయలు త్వరగా పండటానికి, పండ్లు మంచి రంగులో కనిపించడానికి వ్యాపారులు అనేక రసాయనాల వినియోగానికి పాల్పడుతుంటారు. అయితే అటువంటి రసాయనాల వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాల్షియం కార్బైట్ వంటి రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే పండ్లపై సిల్క్ కోటింగ్ వేస్తే ఫ్రీజర్ తో అవసరం లేకుండా వారం రోజులపాటు తాజాగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పండ్లపై కనిపించకుండా ఉండే బయో కంపాటిబుల్ సొల్యూషన్ పూస్తే, మృదువుగా ఉండే పండ్లు రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాల్సిన అవసరం ఉండదని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. సహజంగా తయారయ్యే సిల్క్ ద్రావణాన్ని వినియోగించి పండ్లను తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. నీటి ఆధార ప్రక్రియతో సున్నితంగా ఉండే పండ్లను భద్రపరచుకోవడం, ఫ్రీజర్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గమంటున్నారు. స్ఫటికరూపంలో ఉండే ఫైబ్రాయిన్ ప్రోటీన్ కలిగిన సిల్క్... ఇతర పదార్థాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. స్ట్రాబరీలపై వేసే సిల్క్ కోటింగ్ 27 నుంచి, 35 మైక్రాన్ల మందం ఉంటుందని, ఈ ప్రకియ అనంతరం స్ట్రాబరీలను సాధారణ గది ఉష్ణోగ్రతలో భ్రదపరచుకోవచ్చని చెప్తున్నారు. పూత వేసిన పండ్లను, వేయని వాటిని విడివిడిగా భద్రపరచి పరిశీలించారు. బీటా షీట్ సిల్క్ కోటింగ్ వేసిన పండ్లు సాధారణంగా నిల్వ ఉంచిన పండ్లకంటే తాజాగా, రసంతో ఉన్నట్లు గమనించారు. ఎడిబుల్ సిల్క్ ఫైబ్రాయిన్ కలిగిన బేటా షీట్ కోటింగ్ వల్ల పండ్లలో ఆక్సిజన్ తగ్గిపోకుండా ఉండి తాజాదనాన్ని మరింతకాలం పెంచుతుందని టఫ్ట్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఫియోరెంజో తెలిపారు. ఇదే పద్ధతిని అరటిపండ్ల పై కూడ ప్రయోగించి చూశామని, సిల్క్ కోటింగ్ వేసిన పండ్లపై తొక్కలు ఎక్కువకాలం తాజాగా, మృదువుగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. అయితే ఈ సిల్క్ పూత వల్ల పండ్ల ఆకారంలో ఎటువంటి మార్పులు రావని, అయితే పూత వేసిన అనంతరం రుచిలో తేడాలపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదని పరిశోధకులు వివరించారు. సిల్క్ పూత పండ్లను సహజ పద్ధతిలో నిల్వ చేసేందుకుకే కాక, రసాయనాలతో పని లేకుండా ఎగుమతులకు కూడ ఉపయోగంగా ఉంటుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు బెనెడెట్టో మారెల్లీ తెలిపారు. ఈ తాజా అధ్యయనాల వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో నివేదించారు. -
నిర్మాణాత్మక సంస్కరణలతో భారత్‌కు తిరుగులేదు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంటే భారత మార్కెట్లు దాని ప్రభావానికి లోనుకాకుండా స్థిరంగా ఉన్నాయని డ్యుయిష్ బ్యాంక్ సీఈవో గునిత్ చద్దా వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక సంస్కరణల సహాయంతో ఇతర ఆర్థిక వ్యవస్థలను తలదన్నే రీతిలో ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే భారత్ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం కష్టం కాదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థికరంగ అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. అటు పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ఇటు టీ. 20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడానికి సరిపడా ధీటైన టీం ఇండియాకు ఉందని చద్దా వ్యాఖ్యానించారు. ఇక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ కేంద్ర బ్యాంకులు , G- 20 అంశాల్లో డాక్టర్ రఘురామ్ రాజన్ అభిప్రాయాలతో అంగీకరిస్తున్నానన్నారు. కేంద్ర బ్యాంకుల మధ్య సమన్వయం, సహకారం అవసరం అన్నారు. ఫలితంగా కొన్ని పెద్ద మార్కెట్లలో సుదీర్గ సంక్షోభ ప్రమాదం ఉండబోదన్నారు. -
కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు