న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ‘ఐఆర్‌డీఏ’ చైర్మన్‌గా టి.ఎస్.విజయన్ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) సుభాష్ చంద్ర నియామకానికి ఆమోదం తెలిపిందని ఐఆర్‌డీఏ పేర్కొంది.
ఐఆర్‌డీఏ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన విజయన్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. సుభాష్ చంద్ర 1981 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి. గతంలో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment