సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం | Supreme Court refuses to free Subrata Roy Sahara from custody | Sakshi
Sakshi News home page

సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం

Published Thu, Dec 18 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం

సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం

వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రకటన
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులను గుర్తించి, డబ్బు రిఫండ్ చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరో ప్రయత్నం చేసింది. తమ పెట్టుబడులకు సంబంధించిన తగిన ఆధారాలతో జనవరికల్లా వివరాలు తెలియజేయాలని బాండ్‌హోల్డర్లను సెబీ బుధవారం ఒక ప్రకటనలో కోరింది. ఆగస్టులో కూడా సెబీ ఇటువంటి యత్నమే చేసింది. అప్పట్లో దీనికి 2014 సెప్టెంబర్ 30 వరకూ గడువిచ్చింది.

ఈ సందర్భంగా సహారా రెండు కంపెనీలు.. సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ బాండ్‌హోల్డర్ల నుంచి దాదాపు 4,900 రిఫండ్ క్లెయిమ్స్ అందాయి. సెప్టెంబర్ నాటికి క్లెయిమ్స్ దాఖలు చేయనివారి ప్రయోజనాల కోసం తాజా ప్రకటన చేస్తున్నట్లు సెబీ పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా ఈ కంపెనీలు దాదాపు 3 కోట్ల మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లపైగా నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల్లో వైఫల్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ దాదాపు 9 నెలల నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే.

మధ్యంతర బెయిల్ కోసం 10,000 కోట్లు చెల్లించాలన్నది సుప్రీం షరతు. ఆర్‌బీఐ అనుమతి తర్వాతే దేశానికి ఆ డబ్బు...:  బెయిల్‌పై సహారా చీఫ్ విడుదలకు సంబంధించి విదేశాల నుంచి తీసుకువచ్చే నిధులకు ఆర్‌బీఐ ఆమోదం అవసరమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఇది తప్పనిసరన్న వాదనతో ఏకీభవించిన జస్టిస్ టీఎస్ ఠాకూర్‌లతో కూడిన బెంచ్ తాజాగా ఈ సూచన చేసింది. 650 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,600 కోట్లు) విదేశీ రుణం సమకూర్చుకోవడానికి అనుమతించాలన్న సహారా పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement