Sahara Group Company
-
సహారా ఇన్వెస్టర్ల కోసం సెబీ మళ్లీ అన్వేషణ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్మును వెనక్కి ఇచ్చే ప్రయత్నాలను నియంత్రణ సంస్థ సెబీ మళ్లీ మొదలుపెట్టింది. రిఫండ్‌కు అర్హులైన బాండ్హోల్డర్లు పెట్టుబడులకు సంబంధించిన రుజువులతో క్లెయిమ్ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా సెబీ మరోసారి విజ్ఞప్తి చేసింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లు నిబంధనలకు విరుద్ధంగా నిధులను సమీకరించాయని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా(దాదాపు రూ.25,780 కోట్లు) సహారా గ్రూప్ వెనక్కివ్వాలంటూ సుప్రీం కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని సెబీ ద్వారా ఇన్వెస్టర్లకు చెల్లించాలని ఆదేశించింది కూడా. కాగా, సెబీ తాజా విజ్ఞప్తి మూడోది కావడం గమనార్హం. తొలిసారిగా గతేడాది ఆగస్టులో ఇన్వెస్టర్ల వేట మొదలుపెట్టింది. 2014 సెప్టెంబర్‌కల్లా రిఫండ్‌కు క్లెయిమ్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించింది. అయితే, రూ.4,900 కోట్ల విలువైన క్లెయిమ్‌లు మాత్రమే రావడంతో.. డిసెంబర్లో మళ్లీ ఇన్వెస్టర్లకు ఇదేవిధమైన విజ్ఞప్తి చేసింది. అప్పుడు ఎంతమంది దరఖాస్తు చేశారన్న వివరాలేవీ వెల్లడికాలేదు. కాగా, మూడోసారి తాజాగా చేపట్టిన అన్వేషణ ప్రక్రియకు డెడ్‌లైన్ ఏదీ నిర్ణయించకపోవడం విశేషం. ఈ కేసులో సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ సహా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఏడాది నుంచి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకూ సహారా గ్రూప్.. సెబీ వద్ద రూ.12,000 కోట్లను డిపాజిట్ చేసింది. -
సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం
వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రకటన న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులను గుర్తించి, డబ్బు రిఫండ్ చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరో ప్రయత్నం చేసింది. తమ పెట్టుబడులకు సంబంధించిన తగిన ఆధారాలతో జనవరికల్లా వివరాలు తెలియజేయాలని బాండ్హోల్డర్లను సెబీ బుధవారం ఒక ప్రకటనలో కోరింది. ఆగస్టులో కూడా సెబీ ఇటువంటి యత్నమే చేసింది. అప్పట్లో దీనికి 2014 సెప్టెంబర్ 30 వరకూ గడువిచ్చింది. ఈ సందర్భంగా సహారా రెండు కంపెనీలు.. సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ బాండ్‌హోల్డర్ల నుంచి దాదాపు 4,900 రిఫండ్ క్లెయిమ్స్ అందాయి. సెప్టెంబర్ నాటికి క్లెయిమ్స్ దాఖలు చేయనివారి ప్రయోజనాల కోసం తాజా ప్రకటన చేస్తున్నట్లు సెబీ పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా ఈ కంపెనీలు దాదాపు 3 కోట్ల మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లపైగా నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల్లో వైఫల్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ దాదాపు 9 నెలల నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. మధ్యంతర బెయిల్ కోసం 10,000 కోట్లు చెల్లించాలన్నది సుప్రీం షరతు. ఆర్బీఐ అనుమతి తర్వాతే దేశానికి ఆ డబ్బు...: బెయిల్‌పై సహారా చీఫ్ విడుదలకు సంబంధించి విదేశాల నుంచి తీసుకువచ్చే నిధులకు ఆర్బీఐ ఆమోదం అవసరమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఇది తప్పనిసరన్న వాదనతో ఏకీభవించిన జస్టిస్ టీఎస్ ఠాకూర్లతో కూడిన బెంచ్ తాజాగా ఈ సూచన చేసింది. 650 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,600 కోట్లు) విదేశీ రుణం సమకూర్చుకోవడానికి అనుమతించాలన్న సహారా పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.