సాక్షి, ముంబై: వివిధ దేశాల మధ్య ముదుతున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ట్రంప్ షాక్ తగిలింది. ఈయూకార్లపై దిగుమతిసుంకం విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇవాల్టి మార్కెట్‌లో టాటా మోటార్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. 5.94 శాతం నష్టంతో ముగిసింది. ఐరోపాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా యూరోపియన్ యూనియన్ ఉత్పత్తి చేసే కార్లపై 20శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను పెంచినట్లయితే అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) వాహనాలపై భారీ ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా ట్యాక్స్‌ల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్కు దిగుమతులపై 25శాతం, అల్యూమినియం దిగుమతులపై 10శాతం ట్యాక్స్ పెంచి ట్రేడ్ వార్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే భారత్, ఈయూ దేశాలు అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై దిగుమతి సుంకాన్నిపెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. భారత్ 29 ఉత్పత్తులపై ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచగా, యూరోపియన్ యూనియన్ అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం 25శాతం సుంకం పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment