న్యూఢిల్లీ: బహుళ జాతి కంపెనీలకు అందించే బ్యాక్ ఆఫీస్, సపోర్ట్ సేవలకు కూడా జీఎస్‌టీ వర్తిస్తుందంటూ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) ఇచ్చిన ఉత్తర్వులతో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. దీనివల్ల అనేక ఉద్యోగాల్లో కోత పడటంతో పాటు అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
బ్యాక్ ఆఫీస్ సర్వీసులను ఎగుమతులుగా పరిగణించరాదని, 18 శాతం జీఎస్‌టీ పన్ను రేటు వర్తిస్తుందని వీసర్వ్ గ్లోబల్ కేసులో ఏఏఆర్ మహారాష్ట్ర బెంచ్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఊతంతో రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన (గత కాలంలో జరిగిన లావాదేవీలపై కూడా) పన్నుల శాఖ ట్యాక్స్ డిమాండ్ చేసే అవకాశం ఉందని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ సంస్థలు పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment