
న్యూఢిల్లీ: టెలికం సర్వీస్ ప్రొవైడర్ల స్థూల ఆదాయం 2017 జూలై–సెప్టెంబర్ మధ్యకాలంలో దాదాపు 7% క్షీణతతో రూ.66,361 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో వీటి ఆదాయం రూ.71,379 కోట్లుగా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. వీటి సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) ఏకంగా 17.55% క్షీణతతో రూ.50,539 కోట్ల నుంచి రూ.41,669 కోట్లకు పడింది.
త్రైమాసికం పరంగా చూస్తే.. టెల్కోల స్థూల ఆదాయం జూలై–సెప్టెంబర్‌లో పెరిగింది. ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో వీటి స్థూల ఆదాయం రూ.64,889 కోట్లుగా నమోదయ్యింది. టెల్కోల స్థూల ఆదాయంలో వృద్ధి ప్రకటించడం ఇది వరుసగా రెండో త్రైమాసికం.
Comments
Please login to add a commentAdd a comment