హోటళ్లలో సర్వీసు చార్జీ.. పన్ను కాదు | The service fee is not a tax on hotel | Sakshi
Sakshi News home page

హోటళ్లలో సర్వీసు చార్జీ.. పన్ను కాదు

Published Tue, Jul 14 2015 11:32 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

హోటళ్లలో సర్వీసు చార్జీ.. పన్ను కాదు - Sakshi

హోటళ్లలో సర్వీసు చార్జీ.. పన్ను కాదు

కేంద్ర ఆర్థిక శాఖ వివరణ
 
న్యూఢిల్లీ : కొన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలు.. పన్నుల కిందికి రావని ప్రభుత్వం పేర్కొంది. బిల్లు మొత్తంపై విధిస్తున్న ఈ చార్జీలను కొంతమంది వినియోగదారులు సేవా పన్నుగానే పరిగణిస్తున్నారని.. ఇది కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్తోందని పొరబడుతున్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఈటరీస్(ఆహారపదార్థాల విక్రేతలు)లో వసూలు చేస్తున్న ఈ సర్వీసు చార్జీలు వాటికే చెందుతాయని స్పష్టం చేసింది.

కాగా, జూన్ 1 నుంచి కేంద్రం సేవల పన్నును 12.36 శాతం(విద్యా సెస్సుతో కలిపి) నుంచి 14 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ కండిషన్/సెంట్రల్ హీటింగ్ సౌకర్యం ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఈటరీస్‌లో(సంబంధిత ప్రాంగణంలో ఎక్కడ ఉన్నాసరే) వినియోగదారుడు చెల్లించే మొత్తం బిల్లులో కేవలం 40 శాతానికి మాత్రమే ఈ 14 శాతం సర్వీసు పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ ఇదివరకే వివరణ ఇచ్చింది. మొత్తంమీద 5.6 శాతం ఎఫెక్టివ్ పన్ను రేటు అమలవుతుందని తెలిపింది కూడా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement