పై అంతస్తు వేస్తున్నారా? | tips for additional floors build | Sakshi
Sakshi News home page

పై అంతస్తు వేస్తున్నారా?

Published Sat, Dec 3 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

పై అంతస్తు వేస్తున్నారా?

పై అంతస్తు వేస్తున్నారా?

సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ఉండగానే సరిపోదు. పిల్లల చదువుల కోసమో లేక అవసరాల కోసమో కారణమేదైనా.. ఇంటిపై అదనపు ఫ్లోర్లు అవసరం ఉంటుంది. డాబాపై మరో ఫ్లోర్ వేసుకుంటే కొంత సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అలా ఫ్లోర్ వేయాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆ గది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

ముందుగా డాబా ఏ తీరులో నిర్మించారో తెలుసుకోవాలి. దీన్ని బట్టే పై అంతస్తు ఎలా వేయాలన్నది ఆధారపడి ఉంటుంది. భవన నిర్మాణాలు రెండు రకాలు. 1. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేది. దీన్నే ‘లోడ్ బేరింగ్ వాల్ స్ట్రక్చర్’ అంటారు. లోతుగా పునాదుల కోసం గుంతలు తవ్వకుండా రాళ్లతో పునాదులు నిర్మించి ఆపై గోడలు, వాటిపై శ్లాబు నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో భవనం బరువంతా గోడలు, పునాదుల పైనే పడుతుంది. 2. గోతులు తీసి పుటింగులు, పిల్లర్లు వేసి, బీములు నిర్మించి దానిపైన శ్లాబు వేసేది ‘ఫ్రేం స్ట్రక్చర్’. ఇందులో భవనం బరువంతా బీములు, పిల్లర్లు మోస్తారుు. గోడలపై ఎలాంటి భారం పడదు.

లోడ్ బేరింగ్ స్ట్రక్చర్‌పై మేడ..
పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులు వేసుకోవాలంటే.. గ్రౌండ్ ఫ్లోర్ గోడలు 14 అంగుళాల మందంతో నిర్మించాలి. ఫస్ట్ ఫ్లోర్ గోడలు మాత్రం 9 అంగుళాల మందంతో నిర్మిస్తే చాలు. అతి జాగ్రత్తకు పోరుు ఇక్కడా 14 అంగుళాల గోడలు నిర్మిస్తే వృథా ఖర్చు. పైగా కింది గోడలపై భారం ఎక్కువవుతుంది. పైన గదులు విశాలంగా ఉండాలని చెప్పి 14 అంగుళాల గోడపై చివరి నుంచి 9 అంగుళాల గోడను నిర్మిస్తుంటారు. ఇది తప్పు. 14 అంగుళాల గోడకు కచ్చితంగా మధ్యలో 9 అంగుళాల గోడను నిర్మించాలి. లేకపోతే బరువు సరిగ్గా సర్దుబాటు కాక గోడలు దెబ్బతింటారుు. కిటికీలు, తలుపులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుగానే పైనా నిర్మించాలి. ఇలా చేస్తే కింద అంతస్తులోని తలుపులు, కిటికీలపై అదనపు భారం పడకుండా ఇల్లు పటిష్టంగా ఉంటుంది. బాల్కనీ అంచుల్లో గోడలు కట్టాలన్నా శ్లాబు కింద బీములు తప్పనిసరి. పెద్ద పోర్టికో కావాలన్నా శ్లాబుల కింద బీములు ఉండాల్సిందే. వీలైనంత వరకు ఇలాంటి పద్ధతిలో మూడో అంతస్తు నిర్మించకపోవడమే మంచిది. 30 ఏళ్లు దాటిన పాత ఇళ్లపైన మరో అంతస్తు నిర్మించడం సరైన పద్ధతి కాదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పూజ గదిపై మరుగుదొడ్డి రాకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండా కింద ఉన్న పూజగదిపై నడిచే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడమే మంచిది.

 ఫ్రేమ్ స్ట్రక్చర్డ్ అరుుతే..
ఇందులో గోడలన్నవి గదుల విభజన కోసమే. ఇవి ఎలాంటి బరువునూ మోయవు. కాబట్టి గోడలు ఎంత మందంతో నిర్మించినా పటిష్టతకు డోకా ఉండదు. పైన పిల్లర్లు వేసుకోవడానికి వదిలిన రాడ్లు, ఎండ, వాన ప్రభావానికి లోను కాకుండా డమ్మీ (దిమ్మ) కట్టడం తప్పనిసరి. ఇలా చేయకపోతే రాడ్లు తుప్పుపట్టిపోతారుు. పిల్లర్లు, బీములతో నిర్మించినప్పుడు ముందుగా శ్లాబు పని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే గోడల నిర్మాణం మొదలుపెట్టాలి. పై ఫ్లోర్‌లో కింద గోడకు దూరంగా పైన గోడ నిర్మిస్తే తలుపులు, కిటికీలపై నాలుగు అంగుళాల మందంలో పిల్లర్‌లో కలిసే విధంగా లింటెల్ వేసుకోవాలి. ఇలా చేస్తే వీటి పైభాగంలో నిర్మించే గోడ బరువు దర్వాజపై పడకుండా పిల్లర్లకు మళ్లుతుంది.

2017లో 4 ప్రాజెక్ట్‌లు!
2017 ప్రథమార్థంలో కొత్తగా మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని నిర్ణరుుంచాం. అవేంటంటే.. ఆంటిలియా ప్రాజెక్ట్ సక్సెస్‌తో దీని పక్కనే 10 ఎకరాల్లో టైటానియం పేరిట మరో అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను చేయాలని నిర్ణరుుంచాం. ఇందులో 600 ఫ్లాట్లొస్తారుు.

గోపనపల్లిలో 6.5 ఎకరాల్లో ఈడెన్ ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. ఇందులో 67 విల్లాలొస్తారుు. 240-300 గజాల్లో ఉండే ఒక్కో విల్లా ధర రూ.2-3 కోట్ల మధ్య ఉంటుంది.

మల్లంపేటలో 40 ఎకరాల్లో విల్లా, అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను కూడా చేయనున్నాం. ఇందులో 500 విల్లాలు, 500 ఫ్లాట్లొస్తారుు. బీరంగూడలో 36 ఎకరాల్లో మరో విల్లా ప్రాజెక్ట్ రానుంది. ఇందులో 500 విల్లాల్లొస్తారుు. నానక్‌రాంగూడలో కమర్షియల్ ప్రాజెక్ట్‌ను కూడా చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement