రూ.26 లక్షల కోట్లకుబీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లు!
ముంబై: బీమా పరిశ్రమ (ఇన్సూరెన్‌స ఇండస్ట్రీ) మొత్తం ప్రీమియం వసూళ్లు (లైఫ్, నాన్‌లైఫ్) 2020 నాటికి రూ.26 లక్షల కోట్లకు చేరవచ్చని సీఐఐ-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలోని అధిక సంఖ్యాక ప్రజానీకాన్ని బీమా పరిశ్రమలో భాగస్వాములను చేయడానికి ఇన్సూరెన్‌స కంపెనీలు వాటి వ్యూహాలను సమీక్షించుకోవడం, కస్టమర్లలో ఆర్థిక అవగాహన పెంచడం, భాగస్వామ్యం వంటి పలు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని వివరించింది. కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లలోని అపార వృద్ధి అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఐఐ సూచించింది.
దేశీ జీడీపీలో లైఫ్ ఇన్సూరెన్‌స ప్రీమియం వసూళ్ల వాటా 2.6 శాతంగా, నాన్‌లైఫ్ ఇన్సూరెన్‌స ప్రీమియం వసూళ్ల వాటా 0.7 శాతంగా ఉందని తెలిపింది. ఇక మ్యూచువల్ ఫండ్‌స విషయానికి వస్తే.. గడచిన కొన్ని సంవత్సరాల్లో ఫండ్‌స నేతృత్వంలోని నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) మంచి వృద్ధి నమోదరుు్యందని వివరించింది. వచ్చే నాలుగైదు ఏళ్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని పేర్కొంది. అరుుతే ఎంత వృద్ధి నమోదవుతోన్న దేశ జీడీపీలో మ్యూచువల్ ఫండ్‌స ఏయూఎం వాటా 7 శాతంగా మాత్రమే ఉందని తెలిపింది. ఇది అమెరికాలో 83 శాతంగా ఉందని పేర్కొంది.