premium collections
-
విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే. ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్ ‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శిల్పా కుమార్ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్ లైఫ్ 4.93 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్పీ పారిబాస్ కార్డిఫ్ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్ డీల్ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది. వృద్ధి అవకాశాలు... ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్ వెల్త్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు. నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్ ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు. -
రూ.26 లక్షల కోట్లకుబీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లు!
ముంబై: బీమా పరిశ్రమ (ఇన్సూరెన్స ఇండస్ట్రీ) మొత్తం ప్రీమియం వసూళ్లు (లైఫ్, నాన్‌లైఫ్) 2020 నాటికి రూ.26 లక్షల కోట్లకు చేరవచ్చని సీఐఐ-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలోని అధిక సంఖ్యాక ప్రజానీకాన్ని బీమా పరిశ్రమలో భాగస్వాములను చేయడానికి ఇన్సూరెన్స కంపెనీలు వాటి వ్యూహాలను సమీక్షించుకోవడం, కస్టమర్లలో ఆర్థిక అవగాహన పెంచడం, భాగస్వామ్యం వంటి పలు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని వివరించింది. కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లలోని అపార వృద్ధి అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఐఐ సూచించింది. దేశీ జీడీపీలో లైఫ్ ఇన్సూరెన్స ప్రీమియం వసూళ్ల వాటా 2.6 శాతంగా, నాన్‌లైఫ్ ఇన్సూరెన్స ప్రీమియం వసూళ్ల వాటా 0.7 శాతంగా ఉందని తెలిపింది. ఇక మ్యూచువల్ ఫండ్స విషయానికి వస్తే.. గడచిన కొన్ని సంవత్సరాల్లో ఫండ్స నేతృత్వంలోని నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) మంచి వృద్ధి నమోదరుు్యందని వివరించింది. వచ్చే నాలుగైదు ఏళ్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని పేర్కొంది. అరుుతే ఎంత వృద్ధి నమోదవుతోన్న దేశ జీడీపీలో మ్యూచువల్ ఫండ్స ఏయూఎం వాటా 7 శాతంగా మాత్రమే ఉందని తెలిపింది. ఇది అమెరికాలో 83 శాతంగా ఉందని పేర్కొంది. -
సాంప్రదాయ పాలసీలకు ప్రాధాన్యం
రెండంకెల స్థాయి వృద్ధిపై రిలయన్స్ నిప్పన్ దృష్టి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాంప్రదాయ పాలసీల ఊతంతో రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం వసూళ్లకు సంబంధించి రెండంకెల స్థాయి వృద్ధిని ఆశిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలసీలను 32,000 నుంచి 60,000కి పెంచుకోవాలని భావిస్తోంది. కంపెనీ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) మనోరంజన్ సాహూ సోమవారమిక్కడ ఈ విషయాలు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.4,370 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా ఏజంట్ల సంఖ్యను 1,30,000 నుంచి 1,60,000కు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 5,000 మంది పైగా ఏజెంట్లను నియమించుకోనున్నామని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏజంట్ల సంఖ్య 13,000కు చేరుతుందని సాహూ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు దేశవ్యాప్తంగా రూ. 914 కోట్ల మేర ఉండగా.. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా సుమారు 9 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 18 పథకాలు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. మరో మూడు పథకాలకు (ఒకటి యులిప్స్, రెండు సాంప్రదాయ ప్లాన్స్)కు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయ పాలసీలకే ఎక్కువగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, పోర్ట్‌ఫోలియోలో యులిప్స్ వాటాను క్రమంగా 15 శాతానికి తగ్గించుకోనున్నామని సాహూ చెప్పారు. -
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిల్చింది. 2009-10లో రూ. 800 కోట్ల ప్రీమియం వసూళ్లు నమోదు కాగా 2012-13లో 13% క్షీణించి రూ. 695 కోట్లకు పరిమితమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల స్థూల ప్రీమియం ఆదాయాల ఆధారంగా పరిశ్రమల సమాఖ్య అసోచాం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.