న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, మొబైల్ సేవల నాణ్యత వంటి సమస్యలను పరిష్కరించేలా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పేర్కొంది. సమస్యకు పరిష్కారం చూపే యాక్షన్ ప్లాన్ వల్ల పరిశ్రమ దైహిక సమస్యలను అధిగమించగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించి టెలికం కంపెనీలు సంస్థాగతంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అందుకే వీటన్నింటి పరిష్కారానికి ట్రాయ్ సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తీసుకురావడంపై కసరత్తు చేయాలన్నారు. కాగా కాల్ డ్రాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కాల్ నాణ్యత అంశమై టెలికం ఆపరేటర్లతో భేటీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment