కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ సీరియస్‌ | Trai gets tough on call drops; slaps penalty of upto Rs 10 lakh | Sakshi
Sakshi News home page

కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ సీరియస్‌

Published Fri, Aug 18 2017 4:36 PM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ సీరియస్‌

కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ సీరియస్‌

సాక్షి, న్యూఢిల్లీ : కస్టమర్లకు తీవ్ర అసౌకర్యం కలిగించే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ స్పందించింది. కాల్‌ డ్రాప్స్‌ను నిరోధించేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.  ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యే మొబైల్‌ ఆపరేటర్లకు రూ పది లక్షల వరకూ జరిమానాను విధిస్తున్నట్టు ట్రాయ్‌ పేర్కొంది.

కాల్‌ డ్రాప్స్‌ను నివారించడంలో విఫలమైతే తొలుత 5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని, ఇదే పద్ధతి కొనసాగితే జరిమానాను రూ పదిలక్షలకు పెంచుతామని ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాల్‌ డ్రాప్‌పై రూ 50,000 పెనాల్టీ విధిస్తున్నారు. ఆయా నెట్‌వర్క్‌ల సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాలను నిర్ధేశిస్తామని ట్రాయ్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement