ట్విటర్‌ ఖాతాదారులకు శుభవార్త | Twitter Lite Is Available In India | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 14 2018 5:19 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Twitter Lite Is Available In India - Sakshi

ట్విటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మీ మొబైల్‌లో ఎక్కువ స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం లేదు

సాక్షి, న్యూఢిల్లీ : ట్విటర్‌ ఖాతాదారులకు శుభవార్త. ట్విటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మీ మొబైల్‌లో ఎక్కువ స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం లేదు. తక్కువ స్పెస్‌, ఎంబీతో తర్వగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలయ్యే ట్విటర్‌ లైట్‌ యాప్‌ ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ట్విటర్‌ లైట్‌ వెర్షన్‌ తీసుకొచ్చినప్పటికీ ఇండియాలో అది అందుబాటులో లేదు. అప్పుడు కేవలం 24 దేశాలల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా మంగళవారం ఇండియాతో సహా మరో 20 దేశాలల్లో ట్వీటర్‌ లైట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

దీంతో ప్రస్తుతం 45 దేశాల్లో ట్విటర్‌ లైట్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంది.  అతి తక్కువ మొమోరీతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ట్వీటర్‌ లైట్‌ని 3ఎంబీ సైజుతో ఇన్‌స్ట్రాల్‌ చేసుకోవచ్చు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల్లో కూడా దీనిని త్వరగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లైట్‌ వెర్షన్‌తో స్టోరేజ్‌ స్పెస్‌ తగ్గించడమే కాకుండా ఇంటర్నెట్‌ స్లోగా ఉన్నప్పటికీ ఫాస్ట్‌గా ట్వీట్‌ను చేయవచ్చు. అంతే కాకుండా వీడియోలను, చిత్రాలను లోడ్‌ చేసుకోవాలో లేదో యూజర్‌ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. లోడ్‌ వీడియో ఆప్షన్‌తో డాటాని, టైమ్‌ని ఆదా చేసుకోచ్చు. నేటి నుంచి ట్విటర్‌ లైట్‌ యాప్‌ను గూగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ట్విటర్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement