సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం చర్యపై రియాల్టీ సంస్థ యూనిటెక్ సోమవారం సుప్రీంను ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌ను సుప్రీంలో సవాల్ చేసింది. ట్రిబ్యునల్ ఆర్డర్‌పై ప్రభుత్వం ఆధీనంలోకి రానున్న యూనిటెక్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై యూనిటెక్ వాదనలను రేపు (డిసెంబర్ 12) న సుప్రీం విననుంది.
కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గట్టి షాకిచ్చింది. ని డైరెక్టర్లు వ్యక్తిగత లేదా సంస్థ ఆస్తులను విక్రయించకుండా నిరోధించడంతోపాటు, తదుపరి విచారణ నాటికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుఎన్‌సీఎల్ వివరించింది తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment