దేశీయ డ్రగ్‌ దిగ్గజాలకు అమెరికా షాక్‌ | US states sue 5 Indian generic drug makers over price cartelisation  | Sakshi
Sakshi News home page

దేశీయ డ్రగ్‌ దిగ్గజాలకు అమెరికా షాక్‌

Published Thu, Nov 2 2017 10:38 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

 US states sue 5 Indian generic drug makers over price cartelisation  - Sakshi

ముంబై : దేశీయ డ్రగ్‌ దిగ్గజాలకు అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాలో తీవ్ర షాక్‌ ఎదురైంది. ధరలు నిర్ణయించే విషయంలో అన్యాయపూర్వకమైన విధానాన్ని పాటిస్తున్నారంటూ... 12 జెనరిక్‌ డ్రగ్‌ తయారీదారులపై అమెరికా రాష్ట్రాలు సరికొత్త దావా దాఖలు చేశాయి. ఈ 12లో మన దేశానికి చెందిన డ్రగ్‌ దిగ్గజాలు ఐదు ఉన్నాయి. ఈ తయారీదారులు అన్యాయపూర్వకమైన ధరల విధానాన్ని అమలు చేస్తున్నారని, ధరలు నిర్ణయించడంలో వీరే ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారని దావాలో పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో రెగ్యులేటరీ తనిఖీలు, ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ దిగ్గజాలకు, ఇది మరో షాక్‌గా నిలిచింది. ఈ దిగ్గజాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌, జిడస్‌ కాడిలా ఫార్మాస్యూటికల్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉన్నాయి. 

అంతర్జాతీయ దిగ్గజాల్లో తెవా, సాండోజ్, యాక్టివిస్ వంటివి ఉన్నాయి. 45 రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఈ దావా దాఖలు చేశాయి. ఈ కొత్త దావాలో కొంతమంది ఎగ్జిక్యూటివ్‌ పేర్లను కూడా రాష్ట్రాలు ప్రతిపాదించాయి. మైలాన్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మాలిక్‌, ఎంక్యూర్‌ ఫార్మా ఎండీ సతీష్‌ మెహతా ఉన్నారు. ఈ కంపెనీలపై విచారణ కొనసాగుతుందని, ఇతర కంపెనీలు, వ్యక్తులపై కూడా అదనపు చర్యలు తీసుకోనున్నట్టు డైరెక్టర్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసు ఆఫ్‌ ది అటార్ని జనరల్‌ పేర్కొన్నారు. ఈ విచారణలో భాగంగా భవిష్యత్తులో మరింత మంది పేర్లు బయటికి వచ్చే అవకాశాలున్నాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement