వొడాఫోన్కు రెట్టింపైన నష్టాలు
మొదటి ఆరు నెలల్లో రూ.37,382 కోట్లు
లండన్: బ్రిటిష్ టెలికం మేజర్ వొడాఫోన్ నష్టాలు రెట్టింపయ్యారుు. సెప్టెంబర్‌రో ముగిసిన అర్ధ సంవత్సరంలో 5 బిలియన్ల యూరోలు (రూ.37,382 కోట్లు)కు చేరారుు. వాస్తవానికి గతేడాది ఇదే కాలంలో వొడాఫోన్ నష్టాలు 2.34 బిలియన్ యూరోలు (రూ.17,493 కోట్లు)గానే ఉన్నారుు. ముఖ్యంగా భారత్‌లో కార్యకలాపాలు వొడాఫోన్‌కు కలసిరాలేదు. తీవ్రమైన పోటీ, ముఖ్యంగా జియో రంగ ప్రవేశంతో ఎదురైన ప్రభావం కంపెనీపై పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో భారత్ వ్యాపారానికి సంబంధించి 5 బిలియన్ యూరోల మేర నగదేతర నష్టాలు నమోదైనట్టు వొడాఫోన్ తన ఫలితాల నివేదికలో పేర్కొంది.
భారత టెలికం మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడం, తక్కువ నగదు ప్రవాహం వల్ల ఈ మేరకు నష్టాలు ఎదురయ్యాయని వివరించింది. గతేడాది మొదటి ఆరు నెలల కాలంలో నిర్వహణ లాభం 1.1 బిలియన్ యూరోలుగా ఉండగా, తాజా సమీక్షా కాలంలో 4.7 బిలియన్ యూరోల (రూ.35,137 కోట్లు) నష్టం ఎదురైందని... భారత్‌లో పెట్టుబడులు, ఇబిటా తక్కువగా ఉండడం వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది. కాగా, మార్కెట్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత భారత్‌లో ఐపీవోకు జారీచేయాలని భావిస్తున్నామని, అరుుతే అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని వొడాఫోన్ తెలిపింది.