half year
-
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
ఎల్ఐసీ దూకుడు..తొలి ఆర్నెళ్లలో రాకెట్లా..
ముంబై: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,437 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 6.14 కోట్లు మాత్రమే ఆర్జించింది. కొత్త బిజినెస్ ప్రీమియం 554 శాతం వృద్ధి చూపింది. మొత్తం నికర ప్రీమియంలు రూ. 1,679 కోట్లు పెరిగి దాదాపు రూ. 1.86 లక్షల కోట్లను తాకాయి. ఈ పద్దుకింద గతేడాది ఇదే కాలంలో రూ. 1.84 లక్షల కోట్లు నమోదైంది. మొత్తం ప్రీమియంలు, పెట్టుబడులపై ఆదాయం రూ. 17,404 కోట్లు ఎగసి రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. వీటిలో పెట్టుబడులపై ఆదాయం వాటా రూ. 15,726 కోట్లు పెరిగి రూ. 1.49 లక్షల కోట్లయ్యింది. చదవండి: Maruti Suzuki: మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! ఆ రెండూ తీవ్రంగా దెబ్బతీశాయి..! -
వొడాఫోన్‌కు రెట్టింపైన నష్టాలు
మొదటి ఆరు నెలల్లో రూ.37,382 కోట్లు లండన్: బ్రిటిష్ టెలికం మేజర్ వొడాఫోన్ నష్టాలు రెట్టింపయ్యారుు. సెప్టెంబర్‌రో ముగిసిన అర్ధ సంవత్సరంలో 5 బిలియన్ల యూరోలు (రూ.37,382 కోట్లు)కు చేరారుు. వాస్తవానికి గతేడాది ఇదే కాలంలో వొడాఫోన్ నష్టాలు 2.34 బిలియన్ యూరోలు (రూ.17,493 కోట్లు)గానే ఉన్నారుు. ముఖ్యంగా భారత్‌లో కార్యకలాపాలు వొడాఫోన్‌కు కలసిరాలేదు. తీవ్రమైన పోటీ, ముఖ్యంగా జియో రంగ ప్రవేశంతో ఎదురైన ప్రభావం కంపెనీపై పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో భారత్ వ్యాపారానికి సంబంధించి 5 బిలియన్ యూరోల మేర నగదేతర నష్టాలు నమోదైనట్టు వొడాఫోన్ తన ఫలితాల నివేదికలో పేర్కొంది. భారత టెలికం మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడం, తక్కువ నగదు ప్రవాహం వల్ల ఈ మేరకు నష్టాలు ఎదురయ్యాయని వివరించింది. గతేడాది మొదటి ఆరు నెలల కాలంలో నిర్వహణ లాభం 1.1 బిలియన్ యూరోలుగా ఉండగా, తాజా సమీక్షా కాలంలో 4.7 బిలియన్ యూరోల (రూ.35,137 కోట్లు) నష్టం ఎదురైందని... భారత్‌లో పెట్టుబడులు, ఇబిటా తక్కువగా ఉండడం వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది. కాగా, మార్కెట్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత భారత్‌లో ఐపీవోకు జారీచేయాలని భావిస్తున్నామని, అరుుతే అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని వొడాఫోన్ తెలిపింది.