
ముంబై: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,437 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 6.14 కోట్లు మాత్రమే ఆర్జించింది.
కొత్త బిజినెస్ ప్రీమియం 554 శాతం వృద్ధి చూపింది. మొత్తం నికర ప్రీమియంలు రూ. 1,679 కోట్లు పెరిగి దాదాపు రూ. 1.86 లక్షల కోట్లను తాకాయి. ఈ పద్దుకింద గతేడాది ఇదే కాలంలో రూ. 1.84 లక్షల కోట్లు నమోదైంది.
మొత్తం ప్రీమియంలు, పెట్టుబడులపై ఆదాయం రూ. 17,404 కోట్లు ఎగసి రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. వీటిలో పెట్టుబడులపై ఆదాయం వాటా రూ. 15,726 కోట్లు పెరిగి రూ. 1.49 లక్షల కోట్లయ్యింది.
చదవండి: Maruti Suzuki: మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! ఆ రెండూ తీవ్రంగా దెబ్బతీశాయి..!
Comments
Please login to add a commentAdd a comment