
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర ఒప్పందం మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్ -వాల్ మార్ట్ మధ్య మెగాడీల్ కుదరిందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రీటైలర్ వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 51 శాతానికి పైగా వాటానుకొనుగలోచేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోరెండు వారాల్లో ఈ కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుందని ఇరు కంపెనీలకు చెందిన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం డీల్ విలువ 80 వేల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ రూ.లక్షా 20 వేల కోట్లుగా ఉండనుంది.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటా ఉన్న జపాన్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మాత్రం వాల్ మార్ట్ ఆఫర్ పై ఆసక్తి చూపడంలేదట. రూ.80 వేల కోట్ల ఈ డీల్ చాలా తక్కువని ఆ సంస్థ భావిస్తోందట. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్‌బ్యాంకు ఇంకా అధికారికంగా స్పందించలేదు, అటు వాల్‌మార్ట్ ప్రతినిధి ఈ వార్తలపై వ్యాఖ్యానిచేందుకు తిరస్కరించారు. వాల్‌మార్ట్ రాకతో ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటివరకు ఉన్నటువంటి సౌతాఫ్రికాకు చెందిన నాస్పర్స్, యాక్సెల్, అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థలు తమ పూర్తి వాటాను విక్రయించేందుకు యోచిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ -వాల్మార్ట్ డీల్ విలువపై మార్కెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment