
ముంబై: ఆర్థిక సేవల రంగం గడిచిన ఐదేళ్ల కాలంలో సంపదను సృష్టించిన రంగంగానే కాకుండా, నాశనం చేసినదిగానూ నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో పెట్టుబడులతో 2013– 2018 మధ్య అతిపెద్ద సంపద సృష్టించిన రంగమని పేర్కొంది.
అయితే, ఎన్‌పీఏ సమస్యల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు హరించుకుపోవడం, షేర్ల ధరలు పతనం కావడంతో... ఇదే రంగం అతిపెద్ద సంపదను తుడిచిపెట్టినదిగానూ నిలిచినట్టు అభివర్ణించింది.