వాట్సాప్‌లో మరో బిగ్‌ ఫీచర్‌, వారికోసమే.. | WhatsApp Next Big Feature Is For Businesses To Serve You Better | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మరో బిగ్‌ ఫీచర్‌, వారికోసమే..

Published Sat, May 12 2018 11:25 AM | Last Updated on Sat, May 12 2018 3:33 PM

WhatsApp Next Big Feature Is For Businesses To Serve You Better - Sakshi

వాట్సాప్‌... రోజుకో కొత్త అప్‌డేట్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ను  మరింత మందికి చేరువ చేసి, వ్యాపారాలకు ఉపయోగపడేందుకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. అదే ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’  ఫీచర్‌. దీని ద్వారా వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌ అడ్మిన్లు త్వరగా మెసేజ్‌లను సెర్చ్‌ చేసుకోవచ్చు. అవసరమైన కస్టమర్లను త్వరగా సెర్చ్‌ చేసుకునేందుకు వ్యాపారస్తులకు సాయం చేయాలని ఈ సోషల్‌ మీడియా దిగ్గజం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’ అనే ఫీచర్‌ను తన బిజినెస్‌ యాప్‌కు యాడ్‌ చేసింది. ఈ ఫిల్టర్స్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి సెర్చ్‌ బార్‌పై అడ్మిన్‌ ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’  ఫీచర్‌ యూజర్లను అన్‌రీడ్‌ ఛాట్స్‌, గ్రూప్స్‌, బ్రాడ్‌కాస్ట్‌ కేటగిరీల కింద గ్రూప్‌ చేయనుంది. ఇది అచ్చం ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యాక్షన్‌ బటన్‌’ మాదిరే పనిచేస్తుంది.  ఈ యాక్షన్‌ బటన్‌ కూడా ముఖ్యమైన కస్టమర్లను డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్‌లోకి తీసుకొస్తుంది. 

ప్రస్తుతం వాట్సాప్‌ తీసుకొస్తున్న ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’ అనే ఫీచర్‌తో వ్యాపారాలను మెరుగ్గా చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యమైన కస్టమర్లకు మంచి సేవలను అందించవచ్చు. వారి ప్రాధాన్యత బట్టి కమ్యూనికేషన్‌ను నిర్వహించవచ్చు.  వాట్సాప్‌ ఫర్‌ బిజినెస్‌ అనే యాప్‌ను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని ఈ బిజినెస్ యాప్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నవారు ఈ బిజినెస్ యాప్ ద్వారా తమ వినియోగదారులతో టచ్‌లో ఉండొచ్చు. సులభంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఈ కొత్త యాప్‌ను పాత వాట్సాప్ మెసెంజర్ ప్లాట్‌ఫాం మీద రూపొందించినప్పటికీ.. అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను జతచేశారు. వెరిఫైడ్ ప్రొఫైల్, క్విక్ రిప్లైస్, గ్రీటింగ్ మెసేజెస్, అవే మెసేజెస్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ మాదిరిగానే వాట్సాప్ బిజినెస్ యాప్‌ను చూడా ఎంతో సెక్యూర్‌గా రూపొందించారు. మీ కాల్స్, మెసేజ్‌లు థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement