మహిళలకు ప్రోత్సాహమే లక్ష్యం...
ముంబైలో జరిగిన కార్యక్రమంలో స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రుణ మంజూరీకి సంబంధించిన చెక్కును అందిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరిగిన కార్యక్రమాల్లో భారత ప్రభుత్వ, ప్రైవేటు దిగ్గజ బ్యాంకింగ్‌ల చీఫ్‌లు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా బ్యాంకులు వారికి తగిన ప్రోత్సాహ సహకారాలను అందిస్తాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పర్వతారోహకురాలు చందా గయన్‌ను సన్మానిస్తున్న ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య (ఎడమ చిత్రం).
అమ్మకానికి ఎన్‌పీఏలు...: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్యను తగ్గించుకునే దిశలో భాగంగా తొలిసారిగా కొన్ని ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థలకు (ఏఆర్‌సీ) విక్రయించాలని యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా భట్టాచార్య తెలిపారు. ఈ త్రైమాసికంలోనే దీన్ని చేపట్టేందుకు కొన్ని ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.