ఉద్యోగులను తీసివేస్తున్న ప్రయివేటు బ్యాంకు | Yes Bank cuts employee notice period to 30 days  | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను తీసివేస్తున్న ప్రయివేటు బ్యాంకు

Published Mon, Nov 6 2017 5:02 PM | Last Updated on Mon, Nov 6 2017 5:02 PM

Yes Bank cuts employee notice period to 30 days  - Sakshi

ప్రయివేటు బ్యాంకు  ఎస్‌బ్యాంకు ఉద్యోగులపై వేటువేస్తోంది.  కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు బ్యాంక్‌నిర్ణయించింది. ఈమేరకు  తన ఉద్యోగులకు ఈ మెయిల్‌ సమాచారాన్ని అందించింది. 

ఉద్యోగుల తీసివేతపై సిబ్బంది నోటీసులు అందించింది. నవంబర్ 1 నుంచి  30 రోజుల కాల పరిమితిని  ఇస్తూ .. ఈ మెయిల్‌ సమాచారాన్ని పంపింది.  ఖర్చులు  తగ్గింపుతోపాటు,  చాలా వినియోగదారులకు డిజిటల్‌  బ్యాంకింగ్‌ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో   ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  దాదాపు  ఇదే కారణాలతో మిడ్‌,  సీనియర్‌ స్థాయి ఉద్యోగులు తమ  పదవులకు గుడ్‌ బై చెప్పనున్నారు. 

కాగా  ఈ ఏడాది ప్రారంభంలో యస్ బ్యాంక్ సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించింది. డిజిటలైజేషన్, పేలవమైన పనితీరు వంటి కారణాల  ద్వారా  వీరిని తొలగించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement