భారీ విస్తరణపై యస్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ యస్ బ్యాంక్ భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ (కార్పొరేట్ బ్యాంకింగ్) అమిత్ కుమార్ తెలిపారు. దేశావ్యాప్తంగా 2018 నాటికి శాఖల రెట్టింపు చేయడం ద్వారా 1,800కు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ 660 శాఖలను కలిగి ఉంది. శుక్రవారం యస్‌బ్యాంక్ నేషనల్ సీఎఫ్‌వో ఫోరమ్ హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు కలిసిన విలేకరుల సమావేశంలో అమిత్ మాట్లాడుతూ శాఖలన్నీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తుండటంతో సిబ్బంది నియామకాలు భారీ స్థాయిలో ఉండవన్నారు. అంతకుముందు ఈ ఫోరంని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. 600 మందికి పైగా పాల్గొన ఈ ఫోరంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రధానం చేశారు.