Amit Kumar
-
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు. -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్‌తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్‌లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్‌లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్‌కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్‌లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
నిట్‌లో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్: వరంగల్‌లోని నిట్‌లో ఎంటెక్ తొలి ఏడాది విద్యార్థి అమిత్‌కుమార్ (31)మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్ రాష్ట్రంలోని నవాడాకు చెందిన శంకర్ ప్రసాద్, లలితాదేవి దంపతుల కుమారుడు అమిత్ నిట్‌లో ఎంటెక్ ట్రిపుల్ఈ విభాగంలో ‘పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్’ కోర్సు చదువుతున్నాడు. నిట్‌లోని 1.8కే అల్ట్రామెగా హాస్టల్లోని ఏ8–27 గదిలో ఉంటున్న అమిత్.. రోజూ తండ్రితో ఫోన్లో మాట్లాడేవాడు. 2 రోజులుగా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో తండ్రి శంకర్‌ప్రసాద్.. అమిత్‌మిత్రుడు రాహుల్‌కు ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడించమని అడిగాడు. అమిత్‌ను కలిసేందుకు వెళ్లిన అతడి మిత్రులు హాస్టల్ గదిలో అమిత్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం గమనించారు. వెంటనే వారు నిట్ యాజమాన్యం, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇటీవల పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం, స్టైఫండ్ ఆగిపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఇన్స్పెక్టర్ అజయ్ తెలిపారు. -
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం
లండన్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈ ప్రదర్శన చేయడం ద్వారా అమిత్ కొత్త ఆసియా రికార్డును నమోదు చేశాడు. ఈ ఈవెంట్లో జెల్జ్కో (సెర్బియా; 31.99 మీ.) ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం నెగ్గాడు. భారత్‌కే చెందిన ధరంబిర్ (22.34 మీ.) పదో స్థానంలో నిలిచాడు. అమిత్ కుమార్ నేడు (మంగళవారం) డిస్కస్ త్రో ఎఫ్52 ఈవెంట్లో కూడా పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్ త్రో ఎఫ్46లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిలా నటించి..
గుడ్ గావ్: ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిలా నటించి ప్రముఖ హోటల్ ను మోసగించాలని చూసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రంలో ప్రముఖ హోటల్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనను విడుదల చేసింది. దాంతో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సును పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్న అమిత్ కుమార్(29) అందుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఉద్యోగం వస్తుందో రాదో అనే సందేహంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని క్రోన్ ప్లాజా హోటల్ కు ఫోన్ చేశాడు. తనను తాను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గా పరిచయం చేసుకున్నాడు. తన రిఫరెన్స్ ద్వారా అమిత్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడని, అతనికి జాబ్ ఇవ్వాలని హెటల్ యాజమాన్యాన్ని కోరాడు. దీంతో అనుమానించిన హోటల్ యాజమాన్యం ఫోన్ నెంబర్ ను ట్రూ కాలర్ ద్వారా పరిశీలించింది. ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ నుంచి కాల్ రాలేదని తెలియడంతో సీఎంవో, పోలీసులకు సమాచారం అందించింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ఢిల్లీలోని అతని ఇంట్లో అరెస్టు చేశారు. ఫోన్ కాల్ ద్వారా ముఖ్యమంత్రిలా మాట్లాడటమే కాకుండా రెజ్యూమ్ మీద ఖట్టర్ పేరును కూడా అమిత్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడిని ఒక రోజు పాటు పోలీసుల విచారించేందుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన అమిత్ కుమార్, ప్రవీణ్ కుమార్ గండేపల్లి మండలం సూరంపాలెంలలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేశారు. స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకుందామని సామర్ల కోటకు స్కూటర్ పై బయల్దేరారు. పెద్దాపురం సమీపంలోని అరవింద ప్లాస్టిక్స్ కంపెనీ వద్ద మూల మలుపులో వారి స్కూటర్ స్కిడ్ అయ్యి లారీ కిందకు దూసుకు పోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. -
భారీ విస్తరణపై యస్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ యస్ బ్యాంక్ భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ (కార్పొరేట్ బ్యాంకింగ్) అమిత్ కుమార్ తెలిపారు. దేశావ్యాప్తంగా 2018 నాటికి శాఖల రెట్టింపు చేయడం ద్వారా 1,800కు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ 660 శాఖలను కలిగి ఉంది. శుక్రవారం యస్‌బ్యాంక్ నేషనల్ సీఎఫ్‌వో ఫోరమ్ హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు కలిసిన విలేకరుల సమావేశంలో అమిత్ మాట్లాడుతూ శాఖలన్నీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తుండటంతో సిబ్బంది నియామకాలు భారీ స్థాయిలో ఉండవన్నారు. అంతకుముందు ఈ ఫోరంని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. 600 మందికి పైగా పాల్గొన ఈ ఫోరంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తికి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశారు.