తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద టీడీపీ హోర్డింగ్
సాక్షి, కుప్పం(చిత్తూరు): ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టణంలో అధికార పార్టీ బ్యానర్ల విషయంలో అధికారులు పట్టీపట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రసిద్ధ తిరుపతి గంగమ్మ దేవాలయం ప్రాంగణం తెలుగుదేశం పార్టీ నేతల బ్యానర్లకు చిరునామాగా మారిపోయింది. టీడీపీకి చెందిన నేతలు ఇక్కడ పాలక వర్గ సభ్యులుగా కొనసాగుతుండడంతో పట్టణంలో ఉన్న బ్యానర్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి కోడ్‌ను ఉల్లంగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజు దేవాలయానికి వచ్చే భక్తులు, అమ్మవారి దర్శనం అనంతరం తెలుగుదేశం పార్టీ బ్యానర్లను దర్శించుకోవాల్సి వస్తోంది. ఆలయంలో ఎలాంటి ప్రచార హోర్డింగులు, బ్యానర్లు ఉంచరాదని కోడ్ స్పష్టంగా చెబుతున్నా, టీడీపీ నాయకులు ఇవేమి పట్టడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment