తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో విజిలెన్స్ అధికారులు జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నారు. వెంకట పథం రోడ్డులో 28 జిలెటిన్ స్టిక్స్,34 డిటోనేటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్ధాలన్నీ ఓ బ్యాగులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు. ఇంజనీరింగ్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటపథం మూడో విడత పనుల నిమిత్తం నిబంధనలకు వ్యతిరేకంగా తెప్పించారని ఆరోపణలు వస్తోన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment