
చండీగఢ్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన రాష్ట్రంలోని జింద్-హన్సీ సమీప ప్రాంతాల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొని తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న వారిని వెనక నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే పది మంది మృత్యువాత పడగా, ఒకరు గాయాలతో బయటపడ్డారు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మరణించిన పది మందిలో అయిదుగురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment