
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయనగరం : బాలికపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విజయనగరం మండలంలో అయిదేళ్ల బాలిక ఇంటి వెనకాల ఉంటున్న 60 ఏళ్ల వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరి పెద్దలను ఆశ్రయించారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కస్టడికి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు విజయనగరం ఘోసా ఆసుపత్రిలో బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment