ఎటా: ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో పెళ్లికి వచ్చిన 9 ఏళ్ల బాలికపై పింటు (22) అనే వ్యక్తి రేప్ చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి ఈ దారుణం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడనీ, పింటుతోపాటు అతని సోదరుణ్ని పోలీసులు అరెస్టుచేశారు.
బాలిక కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం, పలు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోనూ పెళ్లికి వచ్చిన 11 ఏళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. కబీర్‌ధాం జిల్లాలో పెళ్లికి అతిథిగా వచ్చిన ఉత్తమ్ సాహు అనే వ్యక్తి బుధవారం రాత్రి బాలికను రేప్ చేసి తర్వాత బండరాయితో తలపై మోది హత్య చేశాడని ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment