జైపూర్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని బిగోడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా నుంచి కోటా జిల్లాకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు మార్గ మాధ్యలో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బిల్వారాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం గెహ్లాట్ ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.
Deeply saddened to know of a terrible road accident in Mandalgarh(Bhilwara) in which many lives have been lost. My thoughts & prayers are with bereaved families.May God give them strength to bear this loss. Have directed officials to ensure the best possible treatment to injured.
— Ashok Gehlot (@ashokgehlot51) February 10, 2020
Comments
Please login to add a commentAdd a comment