
సాక్షి, జగిత్యాల : కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ కూడా దుర్మరణం పాలయ్యాడు. అయితే శ్రీనివాస్‌కు ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు దక్కింది. అయితే అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment