
పట్నా: దేశంలో మూకదాడులు రోజురోజకీ పెరిగిపోతున్నాయి. తాజాగా బిహార్‌లో మరో మూకదాడి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన పట్నాకి సమీపంలోని దానాపూర్‌లో శనివారం జరిగింది. చిన్న పిల్లలను ఎత్తుకు పోతున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలు కావడంతో అక్కడిక్కడికే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యను అదుపులో ఉంచుతామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దీనిపై అధికార జేడీయూ నేత స్పందిస్తూ.. పోలీసులు ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇదే ప్రాంతంలో గత జూలై 30న సైతం ఒక వ్యక్తి మూకదాడిలో మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment