ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న బాంబ్‌స్క్వాడ్, పోలీసులు
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని సాల్మాన్‌పురం శివారు ప్రాంతంలోని కోటయ్య నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ పేలుడు జరిగింది. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కోటయ్య కోతులు, పందులను కాల్చేవాడు. తుపాకీ లైసెన్స్ పొంది ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం కిందట సాల్మాన్‌పురం శివారు ప్రాంతంలోని ఇంటిని కొన్నాడు. కోటయ్య బుచ్చిరెడ్డిపాళెంలోనే నివాసముంటున్నాడు. ఇంట్లో నల్ల మందును నిల్వ చేసుకున్నాడు. తుపాకీ గుండ్లకు కావాల్సినంత కాకుండా మొత్తం కలిపి ఉంచాడు.
దీంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇల్లు మొత్తం నేలమట్టమైంది. గోడలు సైతం పగిలి చెల్లాచెదురుగా పడ్డాయి. ఇంటి శకలాలు గ్రామంలో వెళ్లి పడ్డాయి. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పరిశీలించారు. సీఐ సుబ్బారావు, సంగం ఎస్సై నాగార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. నల్లమందు నిల్వ కారణమని తేల్చారు. నల్లమందు నిల్వపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణం కావడంపై కోటయ్యపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment