ఆగని కాసుల వేట | bribery collecting in mortuary room | Sakshi
Sakshi News home page

ఆగని కాసుల వేట

Published Tue, Oct 10 2017 8:48 AM | Last Updated on Tue, Oct 10 2017 8:48 AM

bribery collecting in mortuary room

రోగి బంధువు నుంచి డబ్బులు తీసుకుంటున్న కేంద్రాస్పత్రి ఉద్యోగి సిమ్మడు

విజయనగరం ఫోర్ట్‌: కేంద్రాస్పత్రిలో శవాలపై కాసుల వేట ఆగడం లేదు. అధికారులు మెతక వైఖరి అవలంభిస్తుండడంతో సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కూడా ఓ ఉద్యోగి మృతుల బంధువుల నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. గాజులరేగకు చెందిన ఓ మహిళా మృతదేహానికి  పోస్టుమార్టం చేసినందుకు గాను మృతురాలి బంధువు వద్ద కేంద్రాస్పత్రి ఉద్యోగి సిమ్మడు డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మృతిరాలి బంధువు ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మీడియాకు అందించారు. ఈ విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటిండెంట్‌ సీతారామరాజు వద్ద ప్రస్తావించగా, ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement