
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్లు దొరికాయి. కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రానికి చెందిన రాంమోహన్‌రెడ్డి ట్రూజెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం వద్ద సీఐఎఫ్‌ఎస్ భద్రతా దళాలు అతని బ్యాగును తనిఖీ చేయగా.. అందులో 17 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు రాంమోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
నంది పైపుల కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాంమోహన్‌రెడ్డికి లైసెన్సు కలిగిన రివాల్వర్ ఉందని పోలీసులు వివరించారు. ప్రయాణానికి బయల్దేరేముందు బ్యాగ్‌ను చెక్ చేసుకోకుండా తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రాంమోహన్‌రెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాంమోహన్‌రెడ్డి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సమీప బంధువని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment