సాక్షి, ముంబయి: లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నలుగురు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్లను, మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ముడుపులు తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్లు ముఖేష్ మీనా, రాజీవ్ కుమార్ సింగ్, సుదర్శన్ మీనా, సందీప్ యాదవ్, సూపరింటెండెంట్ మనీష్ సింగ్ మరో వ్యక్తి నీలేష్ సింగ్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చేందుకు కస్టమ్స్ అధికారులు రూ 50 లక్షల ముడుపులు అడిగారనే ఫిర్యాదుపై సీబీఐ ఈ దాడులు చేపట్టింది. తొలుత రూ 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఓ ప్రైవేట్ వ్యక్తి పట్టుబడగా, వారి ద్వారా మిగిలిన అధికారుల పాత్రనూ సీబీఐ పసిగట్టి వారినీ అదుపులోకి తీసుకుంది. నిందితుల కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment